Breaking News

వరి ధాన్యం కొనుగోలుకు BJPకిసాన్సెల్ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర బీజేపీ కిసాన్ సెల్ (కిసాన్ మోర్చా) అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Published on: 17 Apr 2026 14:40  IST

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర బీజేపీ కిసాన్ సెల్ (కిసాన్ మోర్చా) అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఇందుకోసం వెంటనే కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలను తెరవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని ఆయన విమర్శించారు.ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అధికారులు స్పందించి మద్దతు ధర అమలయ్యేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేయకుండా చూడాలని మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి