Breaking News

కృష్ణా జిల్లా చల్లపల్లిలో కార్ బీభత్సం

కృష్ణా జిల్లా చల్లపల్లిలో డిసెంబర్ 15, 2025న సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 


Published on: 16 Dec 2025 10:13  IST

కృష్ణా జిల్లా చల్లపల్లిలో డిసెంబర్ 15, 2025 సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి

చల్లపల్లి సంతబజారు వద్ద చల్లపల్లి-మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్‌ స్టేషన్‌ రోడ్డులోకి కారు మలుపు తిరిగే సమయంలో ఈ ఘటన జరిగింది.కారు అకస్మాత్తుగా వేగం పుంజుకుని, పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది.మృతురాలిని చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కూతాటి నాగమల్లేశ్వరిగా గుర్తించారు.కారు నడుపుతున్న వ్యక్తి బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ నొక్కడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్న కె. శ్రీనివాసరావుగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ శ్రీనివాసరావుకు కూడా గాయాలవడంతో చికిత్స అందిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి