Breaking News

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది.

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్న వేలాది మంది దరఖాస్తుదారులపై దీని ప్రభావం పడింది.

Published on: 27 Aug 2026 10:18  IST

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్న వేలాది మంది దరఖాస్తుదారులపై దీని ప్రభావం పడింది.

సిబ్బందికి శిక్షణ : వీసా దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా, కఠినంగా పరిశీలించేందుకు వీలుగా తమ కాన్సులర్ అధికారులకు సరికొత్త గ్లోబల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రజా ప్రయోజనాల పరిశీలన : అమెరికా వచ్చే వారు అక్కడ ప్రభుత్వ సహాయం లేదా పబ్లిక్ బెనిఫిట్స్‌పై ఆధారపడే అవకాశం ఉందా లేదా అనేది కచ్చితంగా స్క్రీనింగ్ చేసేలా అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నారు.

అపాయింట్‌మెంట్ ఉన్నవారి పరిస్థితి ఏంటి

ఇప్పటికే ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకున్న చాలా మంది దరఖాస్తుదారులకు "మీ అపాయింట్‌మెంట్ రద్దు చేయబడింది" అని అధికారిక ఈమెయిళ్ళు వచ్చాయి.

రద్దయిన ఇంటర్వ్యూలను తిరిగి ఎప్పుడు షెడ్యూల్ చేస్తారనే దానిపై అమెరికా ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. కొత్త తేదీలను తర్వాత ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని స్పష్టం చేశారు.

ఇమ్మిగ్రెంట్ వీసాలు : అమెరికాలో శాశ్వతంగా నివసించాలనుకునే (గ్రీన్ కార్డ్, ఫ్యామిలీ బేస్డ్) ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు : స్టూడెంట్ వీసాలు (F-1), వర్క్ వీసాలు (H-1B) మరియు టూరిస్ట్ వీసాల (B1/B2) అపాయింట్‌మెంట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రీషెడ్యూల్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి