Breaking News

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలో నిందితుడితో సహా మొత్తం ఏడుగురు మృతి

అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలో నిందితుడితో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మస్కటీన్ నగరంలో జరిగిన ఈ ఘోర ఉదంతానికి కుటుంబ వివాదాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.


Published on: 03 Jun 2026 11:28  IST

అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలో నిందితుడితో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మస్కటీన్ నగరంలో జరిగిన ఈ ఘోర ఉదంతానికి కుటుంబ వివాదాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

కాల్పులకు తెగబడిన వ్యక్తిని మస్కటీన్‌కు చెందిన ర్యాన్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్ (52) గా పోలీసులు గుర్తించారు.సోమవారం మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే అక్కడ నలుగురు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి ఉన్నారు.నిందితుడు అంతటితో ఆగకుండా మిల్ స్ట్రీట్‌లోని మరో ఇంట్లో ఒకరిని, గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సముదాయం (విల్లిట్స్ మెటల్‌వర్క్స్) వద్ద మరొకరిని కాల్చి చంపాడు.పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగా, మిసిసిపీ నది తీరంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో అతను కనిపించాడు. పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరిస్తున్న క్రమంలో, విల్లీస్ తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరణించిన ఆరుగురు బాధితులు కూడా నిందితుడి కుటుంబ సభ్యులే అని పోలీసులు తెలిపారు. వీరిలో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.కుటుంబంలో తలెత్తిన తీవ్ర వివాదాల వల్లే నిందితుడు ఈ సామూహిక హత్యలకు పాల్పడినట్లు మరియు ఇతర స్థానిక పోలీసులు ధృవీకరించారు.ప్రస్తుతం ఈ ఘటనపై మస్కటీన్ పోలీస్ విభాగం, అయోవా స్టేట్ పెట్రోల్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగాలు సంయుక్తంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement