Breaking News

దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు అక్కడికక్కడే మృతి

దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు, వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు.


Published on: 10 Jun 2026 12:39  IST

దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు, వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు.సాంకేతిక లోపం కారణంగా ఒక భారీ ట్రక్కు ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది.అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు, ముందున్న వాహనాన్ని గమనించకపోవడం మరియు సురక్షితమైన దూరాన్ని పాటించకపోవడంతో ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి అత్యంత వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.మరణించిన వారిలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు.

అబ్దుల్ రఫీక్ (మెట్‌పల్లి మండలం)

సయ్యద్ సలీం (కొడిమ్యాల మండలం)

గజుల తిరుపతి (మల్యాల మండలం)

గాయపడిన వారు: మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సయీద్ కూడా ఉన్నాడు.బాధితులందరూ షార్జా కేంద్రంగా పని చేస్తున్న ఒక అల్యూమినియం గ్లాస్, డోర్ ఫ్రేమ్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు.దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.భారత అధికారుల బృందం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి