Breaking News

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగు కాలువ (డ్రైనేజ్) పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా రూ. 98 కోట్లు విలువైన భారీ బంగారు నిధి బయటపడింది.

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగు కాలువ (డ్రైనేజ్) పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా రూ. 98 కోట్లు (€9 మిలియన్లు) విలువైన భారీ బంగారు నిధి బయటపడింది.


Published on: 17 Aug 2026 12:57  IST

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగు కాలువ (డ్రైనేజ్) పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా రూ. 98 కోట్లు (€9 మిలియన్లు) విలువైన భారీ బంగారు నిధి బయటపడింది.

సాధారణ తవ్వకాల్లో: ఆ ప్రాంతంలో ఒక పాత భవనం వద్ద మురుగు కాలువ పైపులు వేయడానికి కార్మికులు భూమిని తవ్వుతున్నారు.

మొదట కాయిన్స్ అనుకున్నారు: అక్కడ వేసవి సెలవుల్లో పార్ట్-టైమ్ పనికి వచ్చిన కోబే (18) అనే విద్యార్థికి నేలలో ఏదో మెరుస్తూ కనిపించింది. మొదట అతను వాటిని సాధారణ 1 యూరో నాణేలు అనుకున్నాడు.

బంగారు నిధి: కానీ మరికొంత తవ్వగా అక్కడ ఒక పాత సంచిలో దాచి ఉంచిన 49 బంగారు కడ్డీలు , వేలాది పురాతన బంగారు నాణేలు, బంగారు ముక్కలు బయటపడ్డాయి.

ఈ నిధి 19వ శతాబ్దం నాటి ఒక పురాతన భవనం (నేలమాళిగ ఇటుకల గోడ మధ్య) లో దాచబడి ఉంది. గతంలో ఆ భవనం థియోఫిలస్ వాన్ అస్చే అనే ప్రముఖ బీరు వ్యాపారికి చెందిన బ్రూవరీగా ఉండేది. ఆ కాలంలోనే ఆ కుటుంబం ఈ బంగారాన్ని అక్కడ దాచి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ భవనాన్ని ఒక సామాజిక సంక్షేమ సంస్థ తమ కార్యాలయం కోసం పునరుద్ధరిస్తోంది.

పోలీసుల స్వాధీనం: నిధి దొరికిన వెంటనే కార్మికులు నిజాయితీగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బంగారాన్ని బ్రస్సెల్స్‌లోని ప్రభుత్వ హై-సెక్యూరిటీ లాకర్‌కు తరలించారు.

5 సంవత్సరాల గడువు: బెల్జియం చట్టం ప్రకారం.. ఈ నిధికి అసలైన వారసులు ఎవరైనా ఉంటే నిరూపించుకోవడానికి 5 సంవత్సరాల సమయం ఉంటుంది.

సగం-సగం వాటా: ఒకవేళ ఐదేళ్లలోపు ఎలాంటి వారసులు రాకపోతే, చట్టప్రకారం ఆ నిధి విలువను దాన్ని కనుగొన్న కార్మికులకు మరియు స్థలం యజమానికి సగం సగం పంచి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో తమకు మంచి రివార్డ్ దక్కుతుందని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఆ స్థలంలో ఇతరులు ఎవరూ తవ్వకాలు జరపకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి