Breaking News

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి ఈరోజు అధికారికంగా రాజీనామా చేశారు

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి ఈరోజు, 24 జూలై 2026 శుక్రవారం నాడు అధికారికంగా రాజీనామా చేశారు.బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) నిబంధనల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్‌కు సమర్పించారు.


Published on: 24 Jul 2026 20:11  IST

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి ఈరోజు, 24 జూలై 2026 శుక్రవారం నాడు అధికారికంగా రాజీనామా చేశారు.బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) నిబంధనల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్‌కు సమర్పించారు.

తన రాజీనామా లేఖలో 76 ఏళ్ల షాబుద్దీన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పేర్కొన్నారు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటుతో పాటు ఇటీవల 'ఆటోనమిక్ న్యూరోపతి' అనే నరాల బలహీనత వ్యాధి నిర్ధారణ అయిందని, దీనివల్ల అప్పుడప్పుడు స్పృహ కోల్పోతున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక చికిత్స అవసరం కావడం వల్లే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వివరించారు.

అధికారికంగా ఆరోగ్య కారణాలు చెప్పినప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఈ ఏడాది మే నెలలో షాబుద్దీన్ రహస్యంగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఏడాది డిసెంబర్‌లో తానే స్వదేశానికి తిరిగి వస్తానని షేక్ హసీనా ఇటీవల ప్రకటించడంతో బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అప్రమత్తమైంది. అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్‌పై ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి పదవి నుంచి దించేసినట్లు సమాచారం.

ఏప్రిల్ 2023లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షాబుద్దీన్ పదవీకాలం వాస్తవానికి ఏప్రిల్ 2028 వరకు ఉంది. అయితే దాదాపు రెండేళ్ల ముందే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.రాజ్యాంగ నిబంధనల ప్రకారం, కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు

 

Follow us on , &

ఇవీ చదవండి