Breaking News

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా బిల్‌ పుల్టేని ఎంపిక చేసారు

అమెరికా జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్‌ పుల్టే నియమితులయ్యారు. జూన్ 2, 2026న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.ప్రస్తుత డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తన భర్త అనారోగ్య కారణాల వల్ల ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.


Published on: 03 Jun 2026 12:16  IST

అమెరికా జాతీయ నిఘా సంస్థ  డైరెక్టర్‌గా బిల్పుల్టే నియమితులయ్యారు. జూన్ 2, 2026న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.ప్రస్తుత డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తన భర్త అనారోగ్య కారణాల వల్ల ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆమె జూన్ 30, 2026 వరకు బాధ్యతల్లో కొనసాగుతారు.తులసి గబ్బార్డ్ తప్పుకున్న తర్వాత బిల్‌ పుల్టే తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

38 ఏళ్ల బిల్‌ పుల్టే ప్రస్తుతం 'ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ' డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ అదనపు బాధ్యతలను చూసుకుంటారు.తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన పుల్టే పూర్తి కాలం ఈ పదవిలో కొనసాగాలంటే అమెరికా సెనేట్ ఆమోదం తప్పనిసరి.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న ఈ కీలక సమయంలో ట్రంప్ తన అత్యంత విధేయుడైన బిల్‌ పుల్టేను ఈ అత్యున్నత నిఘా పదవికి ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement