Breaking News

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది

డిసెంబర్ 17, 2025న న్యూఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. 


Published on: 17 Dec 2025 13:59  IST

డిసెంబర్ 17, 2025న న్యూఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా పరమైన ముప్పు (Security Threat) ఎదురైన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.బంగ్లాదేశ్‌లోని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత ఈశాన్య రాష్ట్రాలైన "సెవెన్ సిస్టర్స్"ను ఒంటరి చేస్తామంటూ చేసిన వివాదాస్పద మరియు విద్రోహ వ్యాఖ్యలపై భారత్ తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది.

ఈ పరిణామాలకు ఒకరోజు ముందే, డిసెంబర్ 16న ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీలో జరిగిన విజయ్ దివస్ వేడుకల్లో రియాజ్ హమీదుల్లా మాట్లాడుతూ.. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర ప్రయోజనం, శాంతి మరియు ప్రాంతీయ భద్రతపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.

అంతకుముందు డిసెంబర్ 14న, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసి, భారత్ నుంచి షేక్ హసీనా చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను సూచిస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి