Breaking News

పురుగుల మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో డిసెంబర్ 31, 2025 బుధవారం తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఒక వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 

Published on: 31 Dec 2025 12:12  IST

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో డిసెంబర్ 31, 2025 బుధవారం తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఒక వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 

మృతులను రాంరెడ్డి మరియు లక్ష్మిగా గుర్తించారు వీరిద్దరూ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం తగ్గకపోవడం, ఏం చేయాలో తోచని స్థితిలో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.మంగళవారం (డిసెంబర్ 30) అర్ధరాత్రి సమయంలో వీరిద్దరూ పురుగుల మందు తాగారు.సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై హమీద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Follow us on , &

ఇవీ చదవండి