Breaking News

శ్రీ శివరామ క్లాత్ స్టోర్లో అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ థియేటర్‌కు సమీపంలోగల ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ శివరామ క్లాత్ స్టోర్లో ఈరోజు (నవంబర్ 10, 2025) ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.


Published on: 10 Nov 2025 12:54  IST

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ థియేటర్‌కు సమీపంలోగల ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ శివరామ క్లాత్ స్టోర్లో ఈరోజు (నవంబర్ 10, 2025) ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.అగ్నిప్రమాదం జరిగిన సమయంలో షాపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ ప్రమాదంలో షాపులోని దుస్తులు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 80 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని బొప్పరాతి రాజు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి