Breaking News

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట్ టీపీఓ సోమయ్య

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) వి. సోమయ్య నివాసం మరియు కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం  ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.


Published on: 03 Sep 2026 17:16  IST

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) వి. సోమయ్య నివాసం మరియు కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం  ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.

ఏకకాలంలో సోదాలు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మానస నగర్‌లో ఉన్న సోమయ్య నివాసం, ఆయన కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

కీలక పత్రాల స్వాధీనం: సోదాల సమయంలో ఆయన ఇంట్లో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, అక్రమ ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, ఆస్తి వివరాలపై విచారణ జరుపుతున్నారు.

ఆరోపణలు: సోమయ్య ఎక్కడ పని చేసినా ఫైళ్లను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచేవాడని, ఆన్‌లైన్ ఫైళ్లను కూడా నెలల తరబడి నిలిపివేసి లంచాలు ఇస్తేనే క్లియర్ చేసేవాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.

నేపథ్యం: గతంలో మిర్యాలగూడలో పనిచేస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి బదిలీ అయి, ఆ తర్వాత పైరవీలతో సూర్యాపేట టీపీఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సూర్యాపేటతో పాటు కోదాడ టీపీఓగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సూర్యాపేటల్లో ఇళ్లు, ప్లాట్లతో పాటు ఎండ్లపల్లిలో ఒక ఆశ్రమం నిర్మించి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి