Breaking News

2.5 కోట్ల విలువైన హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం

హనుమకొండలో ఏప్రిల్ 21, 2026 న హ్యాష్‌ ఆయిల్‌ (Hash Oil) తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన 20 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. 


Published on: 21 Apr 2026 17:29  IST

హనుమకొండలో ఏప్రిల్ 21, 2026 న హ్యాష్‌ ఆయిల్‌ (Hash Oil) తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన 20 కిలోల హ్యాష్ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. 

ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుంది.

నిందితులు ఒడిశా నుంచి హ్యాష్‌ ఆయిల్‌ను సేకరించి, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ముంబయికి తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు.పాండు అనే వ్యక్తి సలహా మేరకు నిందితులు గంజాయి నుంచి యంత్రం సాయంతో సుమారు 40 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ను తయారు చేయించినట్లు విచారణలో తెలిసింది.తయారైన ఆయిల్‌లో సగం (20 కిలోలు) తమ వద్ద ఉంచుకుని, మిగిలినది ముంబయిలో విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement