Breaking News

ఎగిరొచ్చిన ఎయిర్‌బస్‌


Published on: 05 Jan 2026 11:59  IST

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. ఎయిరిండియా ‘ఎయిర్‌బస్‌’ ఎగిరొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది. ట్రయల్‌ రన్‌లో భాగంగా.. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను మోసుకుంటూ ‘ఎయిరిండియా ఎయిర్‌బస్‌ ఏ320’ విమానం తొలిసారిగా ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్‌పోర్టులో క్షేమంగా ల్యాండ్‌ అయింది. ఈ చరిత్రాత్మక ఘట్టంతో ఉత్తరాంధ్ర నేల పులకించింది..! ఢిల్లీ నుంచి 1,600 కిలోమీటర్లు ప్రయాణించి భోగాపురం చేరుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి