Breaking News

సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు


Published on: 30 Dec 2025 17:50  IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో 11 ట్రైన్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 7 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి