Breaking News

మేయర్‌ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం


Published on: 05 Dec 2025 17:55  IST

నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 42 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో వైసీపీ మేయర్‌ స్రవంతిపై ఇటీవల కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 91/ఏ ప్రకారం ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి, అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతినిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement