Breaking News

తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు


Published on: 06 Nov 2025 15:20  IST

హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధితలు  పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement