Breaking News

బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం


Published on: 06 Nov 2025 10:27  IST

బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది. దీంతో మరో గంటలో పోలింగ్ జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.ఈ విడత పోలింగ్‌లో పలువురు కీలకనేతలు.. ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి