Breaking News

తెలంగాణలో రాబోయే మూడు రోజులు వాతావరణం..?


Published on: 04 Nov 2025 15:52  IST

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆయా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి