Breaking News

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


Published on: 04 Nov 2025 12:52  IST

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టును సమర్పించింది. AAI రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సాధ్యమని సూచించింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి