Breaking News

సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన


Published on: 04 Nov 2025 12:19  IST

జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది. ఆటోనగర్ వద్ద జగన్‌కు పెనమలూరు వైసీపీ నాయకత్వం స్వాగతం పలికింది. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ వైసీపీ నాయకత్వానికి పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సూచించారు.పోలీసు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్‌కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి