Breaking News

కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం


Published on: 03 Nov 2025 18:16  IST

కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తూ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని.. అందుకు తెలంగాణ సర్కార్‌ కూడా స్పందించిందని పేర్కొంది. మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి