Breaking News

రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న


Published on: 01 Nov 2025 17:47  IST

భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ఆటకు శనివారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా టెన్నిస్‌లో తన ప్రయాణం గురించి స్మరించుకున్నాడు.నా జీవితానికే అర్థం చెప్పిన టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది. ఇది అంతా ఓ కలలా అనిపిస్తోంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే నాకు దక్కిన పెద్ద గౌరవం’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.

Follow us on , &

ఇవీ చదవండి