Breaking News

తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు


Published on: 01 Nov 2025 14:21  IST

కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట దుర్ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి