Breaking News

శ్రీరామ్‌సాగ‌ర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌..


Published on: 29 Oct 2025 16:18  IST

శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. గేట్లు ఎత్త‌డంతో దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.శ్రీరామ్‌సాగ‌ర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 59,654 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 59,654 క్యూసెక్కులుగా ఉంది. ప్ర‌ధాన గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల‌ను విడుద‌ల చేశారు. శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1091 అడుగులుగా ఉండి. 

Follow us on , &

ఇవీ చదవండి