Breaking News

లక్కీడ్రా పేరుతో టీటీడీ ఎదుట ప్రచారాలు


Published on: 19 Jan 2026 14:51  IST

లక్కీడ్రా ప్రమోషన్‌ కోసం ఇద్దరు యువకులు ఏకంగా హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాన్ని ఎంచుకున్నారు. రూ.399 చెల్లిస్తే లక్కీడ్రా తీసి హ్యుందాయ్‌ ఐ20 కారు, ఐఫోన్‌, టీవీ, బైక్‌ ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మేరకు శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు పడాల కల్యాణి అలియాస్‌ కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి