Breaking News

18న ఏదులాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన


Published on: 14 Jan 2026 17:25  IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ యార్డ్‌, రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రూ.108 కోట్లతో నిర్మించబోయే జేఎన్‌టీయూ భవన నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి