Breaking News

ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు


Published on: 14 Jan 2026 12:34  IST

ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు రాష్ట్ర ప్రజలు. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి