Breaking News

దారుణం.. రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం


Published on: 13 Jan 2026 18:45  IST

రైలు పట్టాలపై ఓ నిండు గర్భిణి ప్రసవించిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన ప్రియ పాత్ర.. నిండు గర్భిణీ. కొద్ది రోజుల్లో ఆమెకు నెలలు నిండనున్నాయి. మంగళవారం ఉదయం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సూరత్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో రైలులో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో సహచర ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని టీసీ ద్వారా గార్డుకు తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి