Breaking News

కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ క్లారిటీ


Published on: 13 Jan 2026 18:00  IST

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  స్పందించారు. మంగళవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి