Breaking News

మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఒవైసీ వ్యాఖ్యలు


Published on: 13 Jan 2026 16:22  IST

హిజాబ్‌ ధరించే ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించడం వెనుక దేశ విభజన రాజకీయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఒవైసీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. ఓ హిందువు ప్రధాని కావాలని పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వెళ్లి డిమాండ్‌ చేయగలరా? అని ఒవైసీకి కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు.భారత్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి