Breaking News

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..


Published on: 12 Jan 2026 15:49  IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వారి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. శివలక్ష్మి ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తన నివాసంలో కన్నుమూశారు. శివలక్ష్మి మరణం వారి కుటుంబంలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.

Follow us on , &

ఇవీ చదవండి