Breaking News

తిరుపతి రైల్లో మంటలు.


Published on: 08 Jan 2026 11:02  IST

పూరి నుంచి తిరుపతి వెళ్లే 17479 నంబర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రైలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. రైలులోని బీ5 బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బోగీల నుంచి కిందకు దింపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి