Breaking News

నాలుగో రోజు ముగిసిన ఆట..


Published on: 07 Jan 2026 15:32  IST

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్‌పై 119 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంగ్లండ్ యువ ప్లేయర్ జాకబ్ బెథెల్(142*) టెస్టుల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. బెథెల్‌తో కలిసి హ్యారీ బ్రూక్(42).. 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డకెట్(42) పర్వాలేదనిపించాడు.

Follow us on , &

ఇవీ చదవండి