Breaking News

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ..


Published on: 07 Jan 2026 15:05  IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందుకోసం ఈ రోజు (బుధవారం) రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి