Breaking News

కోనసీమ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం


Published on: 03 Jan 2026 13:43  IST

కోనసీమజిల్లా కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది.సంక్రాంతికి ముందే మూడు రోజులపాటు జాతీయ స్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ మహేశ్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పడవలపై ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో బోటు తిరగబడింది. లైఫ్‌ జాకెట్‌ ఉండడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. గజ ఈతగాళ్లు ఆయనకు సహకరించి మరో బోటులోకి ఎక్కించారు.

Follow us on , &

ఇవీ చదవండి