Breaking News

చిన్న నోట్లకు తీవ్ర కొరత


Published on: 16 Dec 2025 12:46  IST

దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లకు తీవ్ర కొరత ఏర్పడిందని అఖిల భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐఆర్‌బీఈఏ) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అసలు ఈ నోట్లు దొరకటమే గగనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ, సెమీ అర్భన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని పేర్కొంది. దీంతో సామాన్యులతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి