Breaking News

బాలబాలాజీ ఆదాయం రూ.42.90 లక్షలు


Published on: 12 Nov 2025 17:34  IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీస్వామి హుండీ ఆదాయం రూ.42,90,035 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. ఆలయ ప్రధాన హుండీలను మంగళవారం లెక్కించగా 73 రోజులకు గాను రూ.42,90,035 ఆదాయంతో పాటు 4 గ్రాముల బంగారం, 35 గ్రాముల వెండి వచ్చినట్టుగా ఏసీ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారి జిల్లా దేవాదాయశాఖాధికారి వి.సత్యనారాయణ హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి