Breaking News

రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని వారి నివాసంలో కలిశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు (ఏప్రిల్ 17, 2026) ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని వారి నివాసంలో కలిశారు.


Published on: 17 Apr 2026 17:25  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు (ఏప్రిల్ 17, 2026) ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని వారి నివాసంలో కలిశారు. ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) పారాబాయిల్డ్ (ఉప్పుడు) ధాన్యాన్ని సేకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కేంద్రమంత్రికి వివరించారు.గత 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ బకాయిలు ₹1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి ₹343.27 కోట్ల బకాయిలను కూడా క్లియర్ చేయాలని విన్నవించారు.దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పెరుగుతున్నందున తెలంగాణ నుండి సేకరణ పెంచాలని వారు సూచించారు. తెలంగాణ విన్నపాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి