Breaking News

సంక్షేమ శాఖల టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమని మంత్రి పొన్నం స్పష్టం చేశారు

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖల టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.


Published on: 17 Jun 2026 14:54  IST

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖల టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.తెలంగాణ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆహారం, కోడిగుడ్లు, యూనిఫారాల సరఫరాకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలను మంత్రులు తీవ్రంగా ఖండించారు.

రూ. 2,000 కోట్ల సవాల్: మొత్తం టెండర్ల ప్రక్రియే రూ. 1,142 కోట్లు (గురుకులాల్లో రూ. 683 కోట్లు) అయినప్పుడు, అందులో రూ. 2,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.

రాజీనామాకు సిద్ధం: హరీశ్ రావు తన దగ్గరున్న ఆధారాలతో అవినీతిని నిరూపిస్తే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే హరీశ్ రావు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని నిలదీశారు.

పారదర్శకమైన విధానం: ఈ టెండర్ల ప్రక్రియ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, ముగ్గురు మంత్రులు మరియు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో '-ప్రొక్యూర్మెంట్'  పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరిగిందని వివరించారు.

కోర్టు సమర్థన: ఈ కొనుగోళ్ల ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం కూడా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిందని మంత్రులు గుర్తు చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాలు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడీల పాలన సాగిస్తూ, విద్యార్థులకు కనీసం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇలాంటి నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి