Breaking News

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిపై బోట్ రైడ్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఏప్రిల్ 24, 2026) పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిపై బోట్ రైడ్ చేశారు. ఉదయం 7 గంటల సమయంలో కోల్‌కతాలోని ప్రిన్సెప్ ఘాట్ (Princep Ghat) వద్ద ఆయన బోట్ రైడ్ ప్రారంభించారు.


Published on: 24 Apr 2026 18:52  IST

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఏప్రిల్ 24, 2026) పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిపై బోట్ రైడ్ చేశారు. ఉదయం 7 గంటల సమయంలో కోల్‌కతాలోని ప్రిన్సెప్ ఘాట్ (Princep Ghat) వద్ద ఆయన బోట్ రైడ్ ప్రారంభించారు.మోదీ చేతిలో కెమెరా పట్టుకుని హుగ్లీ నది అందాలను, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ మరియు విద్యాసాగర్ సేతులను ఫోటోలు తీశారు.

గౌరంగా బిస్వాస్ అనే బోటు యజమాని నడిపిన చెక్క పడవలో ప్రధాని సుమారు గంటసేపు ప్రయాణించారు. ఈ ప్రయాణానికి గాను ఆయన బోటు యజమానికి రూ. 1,000 చెల్లించారు.

నది తీరంలో ఉన్న బోటు నిర్వాహకులతో, ఉదయం నడకకు (morning walkers) వచ్చిన స్థానికులతో ఆయన ముచ్చటించారు."గంగానది బెంగాల్ ఆత్మలో ప్రవహిస్తుంది" అని పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల తొలి దశ ముగిసిన మరుసటి రోజే ఆయన ఈ బోట్ రైడ్ చేయడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి