Breaking News

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ ఐకానిక్ మోడల్  'బుల్లెట్ 650' బైక్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ ఐకానిక్ మోడల్  'బుల్లెట్ 650' బైక్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. పాత తరం క్లాసిక్ రిట్రో లుక్, గంభీరమైన ట్విన్-సిలిండర్ ఇంజన్ పవర్ కలయికతో ఈ హెవీ వెయిట్ బైక్ అందుబాటులోకి వచ్చింది.


Published on: 29 May 2026 11:27  IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ ఐకానిక్ మోడల్  'బుల్లెట్ 650' బైక్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. పాత తరం క్లాసిక్ రిట్రో లుక్, గంభీరమైన ట్విన్-సిలిండర్ ఇంజన్ పవర్ కలయికతో ఈ హెవీ వెయిట్ బైక్ అందుబాటులోకి వచ్చింది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 3,64,856 గా నిర్ణయించబడింది.
హైదరాబాద్ ఆన్-రోడ్ ధర: సుమారుగా రూ. 4,55,593 వరకు ఉంటుంది.
రంగులు: ఈ బైక్ క్యానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
ఇంజన్ సామర్థ్యం: ఇందులో 647.95 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్ ఉపయోగించారు.
గరిష్ట పవర్: 7250 rpm వద్ద 46.39 bhp శక్తిని విడుదల చేస్తుంది.
గరిష్ట టార్క్: 5650 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజ్: నగరంలో లీటరుకు సుమారు 20 కి.మీ, హైవేలపై 23 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 
ఐకానిక్ లుక్: సాంప్రదాయ బుల్లెట్ DNAను కొనసాగిస్తూ ప్రసిద్ధ టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సిగ్నేచర్ 'మద్రాస్ పిన్‌స్ట్రైప్స్' , మరియు సింగిల్-పీస్ బెంచ్ సీటును అందించారు.
హెడ్‌లైట్: ముందు భాగంలో క్రోమ్ హుడ్‌తో కూడిన రౌండ్ LED హెడ్‌లైట్ మరియు 'టైగర్ ఐ' పైలట్ లాంప్స్ ఉన్నాయి. 
బ్రేకింగ్ & భద్రత: ముందు వైపు 320mm డిస్క్, వెనుక వైపు 300mm డిస్క్ బ్రేకులతో పాటు సురక్షితమైన ప్రయాణం కోసం డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ కలదు.
చట్రం : గట్టిదనం కోసం స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్, ముందు 43mm టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు.
చక్రాలు: క్లాసిక్ లుక్ కోసం స్పోక్ వీల్స్ ఉపయోగించారు.
బరువు & ట్యాంక్: బైక్ మొత్తం బరువు 243 కేజీలు కాగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14.8 లీటర్లు.
ఆధునిక టచ్: డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్ಲస్టర్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, క్రోమ్ ఫినిషింగ్ గల ట్విన్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్లు) ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement