Breaking News

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మరియు వెళ్లే ప్రయాణికులపై UDF ఛార్జీలను సవరిస్తూ ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి (RGIA) వచ్చే మరియు వెళ్లే ప్రయాణికులపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF) ఛార్జీలను సవరిస్తూ ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.


Published on: 26 Aug 2026 10:35  IST

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి (RGIA) వచ్చే మరియు వెళ్లే ప్రయాణికులపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF) ఛార్జీలను సవరిస్తూ ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు 1 సెప్టెంబర్ 2026 నుండి జారీ చేసే విమాన టికెట్లకు వర్తిస్తాయి.ఈ సవరణ ప్రకారం, విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు ఛార్జీలు తగ్గగా, చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులపై కూడా యూడీఎఫ్ (UDF) భారాన్ని విధించారు.

దేశీయ ప్రయాణికులు బయలుదేరే వారికి : ప్రస్తుతం ఉన్న ₹750 ఛార్జీని ₹515 కి తగ్గించారు.

వచ్చే వారికి : మొదటిసారిగా ₹220 ఛార్జీ విధిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులు

బయలుదేరే వారికి : ప్రస్తుతం ఉన్న ₹1,500 ఛార్జీని ₹1,030 కి తగ్గించారు.

వచ్చే వారికి : మొదటిసారిగా ₹440 ఛార్జీ విధిస్తున్నారు.

ముఖ్యాంశాలు:

ఎయిరోబ్రిడ్జ్‌లు, కన్వేయర్ బెల్టులు, ట్రావలేటర్ల వంటి విమానాశ్రయ వసతులను వచ్చే వారు, వెళ్లే వారు ఇద్దరూ వాడుతుండటంతో ఈ భారాన్ని ఇరువర్గాలకు సమానంగా పంచినట్లు AERA తెలిపింది.

ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ప్రతిపాదించిన భారీ ఛార్జీల పెంపును AERA తిరస్కరించి, సామాన్యులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఛార్జీలు విమాన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే టికెట్ ధరతో పాటే వసూలు చేయబడతాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement