Breaking News

బజాజ్ ఆటో తన ఐకానిక్ క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తూ,సరికొత్త 2026 మోడల్ పల్సర్ 125 మరియు పల్సర్ 150 బైక్‌లను అధికారికంగా విడుదల చేసింది.

బజాజ్ ఆటో తన ఐకానిక్ క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సరికొత్త 2026 మోడల్ పల్సర్ 125 మరియు పల్సర్ 150 బైక్‌లను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది.


Published on: 25 Aug 2026 12:18  IST

బజాజ్ ఆటో తన ఐకానిక్ క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సరికొత్త 2026 మోడల్ పల్సర్ 125 మరియు పల్సర్ 150 బైక్‌లను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. పల్సర్ బ్రాండ్ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బజాజ్ ఈ నెక్స్ట్ జనరేషన్ మోడళ్లను సరికొత్త డిజైన్, సరికొత్త ఇంజిన్ మరియు అధునాతన ఫీచర్లతో లాంచ్ చేసింది.

కొత్త ఫీచర్లు,సాంకేతికత

పాత పల్సర్ మోడళ్లతో పోలిస్తే ఈసారి బజాజ్ భారీ మార్పులను తీసుకువచ్చింది:

మొనోషాక్ సస్పెన్షన్: గతంలో ఉన్న ట్విన్-షాక్ అబ్జార్బర్ల స్థానంలో, ఇప్పుడు సరికొత్తగా రియర్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. దీనివల్ల రైడింగ్ కంఫర్ట్, స్టెబిలిటీ చాలా బాగుంటుంది.

5-ఇంచ్ TFT డిస్‌ప్లే: టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, Google Maps నేవిగేషన్ మిర్రరింగ్, కాల్/మెసేజ్ అలర్ట్స్, మరియు మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్న డిజిటల్ స్క్రీన్‌ను చేర్చారు.

రైడింగ్ మోడ్స్: ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా Road, Rain, మరియు Sport అనే 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు.

క్రాాల్ టెక్నాలజీ (Crawl Tech): ట్రాఫిక్‌లో క్లచ్ మరియు యాక్సిలరేటర్ ఎక్కువగా వాడకుండా, బైక్ నెమ్మదిగా ముందుకు సాగేలా చేసే ఫీచర్ ఇది.

లైటింగ్ , డిజైన్: సరికొత్త LED హెడ్‌ల్యాంప్, DRLలు, క్లియర్ క్రిస్టల్ LED టెయిల్ లాంప్స్ మరియు మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో బైక్ లుక్ చాలా అగ్రెసివ్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి