Breaking News

ట్రంప్ చిత్రంతో $250 డాలర్ల ప్రత్యేక కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన డిజైన్ సిద్ధమైందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ అధికారికంగా ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో $250 డాలర్ల ప్రత్యేక కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన డిజైన్ (మొదటి నమూనా) సిద్ధమైందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ అధికారికంగా ప్రకటించారు.


Published on: 29 May 2026 11:16  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో $250 డాలర్ల ప్రత్యేక కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన డిజైన్ (మొదటి నమూనా) సిద్ధమైందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా తన 250 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్న సందర్భంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతిపాదించారు.

లీగల్ రూల్స్ & అనుమతులు: ప్రస్తుతం ఉన్న అమెరికా చట్టాల ప్రకారం జీవించి ఉన్న ఏ వ్యక్తి చిత్రాన్నీ కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు. ఈ నిబంధనను సవరించి, ట్రంప్ బొమ్మను ముద్రించడానికి వీలుగా యూఎస్ కాంగ్రెస్‌ (పార్లమెంట్) లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ దీనికి తుది ఆమోదం తెలిపితేనే ఈ నోటు చెలామణిలోకి వస్తుంది.

ట్రెజరీ ప్రకటన: చట్ట సవరణ జరిగితే వెంటనే స్పందించేందుకు వీలుగా యూఎస్ ట్రెజరీ శాఖ ముందస్తు ప్లానింగ్ పూర్తి చేసి, నోటు డిజైన్‌ను సిద్ధం ఉంచినట్లు బెస్సెంట్ పేర్కొన్నారు.

ట్రంప్ సంతకం: ఈ కొత్త $250 నోటు ముద్రణ విషయం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నప్పటికీ, ఇప్పటికే విడుదలవుతున్న సాధారణ యూఎస్ డాలర్ నోట్లపై సిట్టింగ్ ప్రెసిడెంట్ హోదాలో డొనాల్డ్ ట్రంప్ సంతకం ముద్రించనున్నారు. అమెరికా చరిత్రలో ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం నోట్లపై రావడం ఇదే తొలిసారి.

ఇతర ప్రత్యేకతలు: 250వ స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24-క్యారెట్ల ప్రత్యేక బంగారు నాణేలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.యూఎస్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ నేతలు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తుండగా, డెమొక్రాట్లు మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు

 

Follow us on , &

ఇవీ చదవండి