Breaking News

భర్త కొట్టిన చెంపదెబ్బకు భార్య మృతి

డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భార్యపై అనుమానంతో భర్త కొట్టిన చెంపదెబ్బకు ఆమె మృతి చెందిన విషాద ఘటన 2026, జనవరి 7న వెలుగులోకి వచ్చింది. 


Published on: 07 Jan 2026 09:56  IST

డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భార్యపై అనుమానంతో భర్త కొట్టిన చెంపదెబ్బకు ఆమె మృతి చెందిన విషాద ఘటన 2026, జనవరి 7 వెలుగులోకి వచ్చింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలోని ఇల్లవారిపాలెం ఈ దారుణానికి వేదికైంది.పుల్లేటికుర్రుకు చెందిన వెంకట సౌజన్య.ఆమె భర్త ఇల్ల శ్రీహరి. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.భార్య ప్రవర్తనపై అనుమానంతో శ్రీహరి మంగళవారం ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సౌజన్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో, వెంటనే అమలాపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

Follow us on , &

ఇవీ చదవండి