Breaking News

ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుండి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 


Published on: 03 Jan 2026 16:35  IST

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3 ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుండి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు సమీపంలోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరం (హైవే), శ్రీ నందమూరి తారకరామారావు ప్రధాన వేదికపై ఈ సభలు జరుగుతున్నాయి.శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఈ మహాసభలు ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం జరిగే ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఉదయం 8 గంటల నుండే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ వంటి కళారూపాలతో సభా ప్రాంగణం సందడిగా మారింది. 

రాబోయే రెండు రోజుల షెడ్యూల్:

మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. సాయంత్రం త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా "తెలుగు వైభవ పురస్కారాల" ప్రదానం జరుగుతుంది.

ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, మహాసభల పోస్టల్ కవర్‌ను ఆవిష్కరిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 'మన తెలుగు భాష - అమృత భాష' అనే అంశంపై ప్రసంగించనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి