Breaking News

నెల్లూరులో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 31 మార్చి 2026, మంగళవారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ - చెన్నై మరియు తిరుపతి మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Published on: 31 Mar 2026 16:57  IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 31 మార్చి 2026, మంగళవారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ - చెన్నై మరియు తిరుపతి మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

నెల్లూరు జిల్లాలోని మనుబోలు - వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కొమ్మరపూడి జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది.విజయవాడ నుండి తిరుపతికి వెళ్తున్న గూడ్స్ రైలులోని ఒక పాల ట్యాంకర్ వ్యాగన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. ట్యాంకర్ పట్టాలపై అడ్డంగా పడిపోవడంతో ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. 

ప్రధాన లైన్‌పై ప్రమాదం జరగడంతో విజయవాడ నుంచి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి.రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది (సుమారు 200 మంది) యుద్ధ ప్రాతిపదికన భారీ క్రేన్ల సహాయంతో ట్రాక్‌పై పడిపోయిన ట్యాంకర్‌ను తొలగించే పనులను చేపట్టారు.ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసి, రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కొన్ని గంటల సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి