Breaking News

హత్య చేసి పొలంలో పాతిపెట్టిన మహిళ

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా (పాత ప్రకాశం జిల్లా) అర్ధవీడు మండల కేంద్రంలో ఒక మహిళను దారుణంగా హత్య చేసి పొలంలో పాతిపెట్టిన ఘటన.


Published on: 27 Aug 2026 20:31  IST

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా (పాత ప్రకాశం జిల్లా) అర్ధవీడు మండల కేంద్రంలో ఒక మహిళను దారుణంగా హత్య చేసి పొలంలో పాతిపెట్టిన ఘటన.పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32). ఆదిలక్ష్మి జులై 21న అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో మృతురాలు ఆదిలక్ష్మి వేరొక మహిళకు రూ. 50 లక్షలు వడ్డీకి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వలేక, ఆదిలక్ష్మిని తన ఇంటికి పిలిపించుకుని కిరాతకంగా హత్య చేసి, ఆపై పొలంలో పాతిపెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement