Breaking News

తిరుమలలో నూతనవధువు మిస్సింగ్ కలకలం

నేడు (ఏప్రిల్ 21, 2026) తిరుమలలో లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే నూతన వధువు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మతన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమలకు వచ్చారు.

Published on: 21 Apr 2026 16:32  IST

నేడు (ఏప్రిల్ 21, 2026) తిరుమలలో లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే నూతన వధువు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మతన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమలకు వచ్చారు.

శ్రీవారి దర్శనం అనంతరం అందరూ కలిసి తిరుమలలోని HVC 694-A గదిలో బస చేశారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఆమె గది నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇటీవలే ఆమెకు పెద్దలు నిశ్చయించిన వివాహం ఇష్టం లేక, అలిగి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఉదయం 7 గంటలకు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, స్థానిక సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తూ ఆమె కోసం గాలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి